డయల్ 112కు తక్షణ స్పందన.. బాధితుడికి పోలీసుల సాయం
గణపురం, నవంబర్ 06 (విజయక్రాంతి): డయల్ 112 ద్వారా అందిన సమాచారానికి తక్షణమే స్పందించిన గణపురం పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్ కానిస్టేబుళ్లు(Blue Colt constables of Ganapuram Police Station) అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రథమ చికిత్స(First Aid) అందించి, కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. నగరంపల్లి గ్రామానికి చెందిన గుఱ్ఱం శ్రీను(Gurram Srinu) శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మూర్ఛ కారణంగా అపస్మారక స్థితిలో ఉన్నట్లు డయల్ 112కు సమాచారం అందింది.
వెంటనే స్పందించిన గణపురం పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్ కానిస్టేబుళ్లు పి.సి. మోహన్, హెచ్.జి. రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనుకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయనను కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. కానిస్టేబుళ్లు సమయస్ఫూర్తితో స్పందించి అందించిన సేవలను గ్రామస్తులు అభినందించారు. గణపురం ఎస్ఐ బొరగల అశోక్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.