ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): ఎల్నినో ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి డా. టి.కె. శ్రీదేవిని ప్రభుత్వం నియమించిందన్నారు.
ఆమె అక్టోబర్ 16, 17 తేదీల్లో జిల్లాల్లో పర్యటించి వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై ప్రభావం, ముందస్తు చర్యలను సమీక్షించనున్నట్లు తెలిపారు. పంటల సంరక్షణ, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, భూగర్భ జలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రత్యేక అధికారి పర్యటనకు సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.