గ్రంథాలయాలు విజ్ఞానానికి దేవాలయాలు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి): గ్రంథాలయాలు విజ్ఞానానికి(Libraries are knowledge) దేవాలయాలని, విద్యార్థులు(Students), నిరుద్యోగ యువత(Unemployed youth) వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. పుస్తక పఠనంతో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని తెలిపారు. భూపాలపల్లి జిల్లా(Bhupalpally District) కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల(National Library Week Celebrations) ముగింపు కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు అధ్యక్షతన జరిగింది.
కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma), అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్లు కురిమిళ్ల శ్రీనివాస్, శారద పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీ పరీక్షలకు(competitive examinations) సిద్ధమయ్యే యువత కోసం గ్రంథాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రాంతాల్లోనూ పఠన మందిరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు రోజూ పఠనానికి సమయం కేటాయించి, నెలకు ఒక పుస్తకం చదవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలతో(social media) సమయం వృథా చేయకుండా లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలన్నారు. చైర్మన్ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలోని 12 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అనంతరం వారోత్సవాల్లో నిర్వహించిన పోటీల విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేంద్రప్రసాద్, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, పాఠకులు పాల్గొన్నారు.