ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి

13-11-2026 | 05:37pm

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు

భూపాలపల్లి, నవంబర్ 13 (విజయక్రాంతి): రబీ 2026–27 సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులను(Farmers') ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు(Chief Secretary to the Government, Sanjay Jaju) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రబీ సాగు(Rabi Cultivation), ధాన్యం కొనుగోళ్లు, విద్య, భూసేకరణ, నీటి సంరక్షణ, వీధి కుక్కల నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు.

వరికి బదులుగా ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్‌, సూక్ష్మ సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును 90 శాతానికి పైగా పెంచాలని, భూసేకరణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు