ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు సోషల్ జస్టిస్ ఫోరం మద్దతు
15-10-2026 | 03:29pm
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు(National Health Mission Employees) చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజు కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సేవలు అభినందనీయమన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అందించిన సేవలను మరువలేమన్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.