జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్‌ 2న నిరసన

29-09-2026 | 04:57pm

భూపాలపల్లి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం ఐజేయూ పిలుపుతో అక్టోబర్‌ 2న గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా దేశవ్యాప్తంగా ‘డిమాండ్ల దినోత్సవం’ నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్‌ తెలిపారు. ఇందులో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించి, అనంతరం కలెక్టర్‌, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులు, ప్రెస్‌క్లబ్‌లు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు