వివిధ కోర్సుల శిక్షణకు అర్హత గల బోధకులకు ఆహ్వానం

13-11-2026 | 05:06pm

ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ : పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్ 

భూపాలపల్లి టౌన్, నవంబర్ 13 ( విజయక్రాంతి ) : సింగరేణి సేవా సమితి(Singareni Seva Samithi) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలో వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు బోధనా సిబ్బందికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

శిక్షణలో భాగముగా టైలరింగ్, కంప్యూటర్ డీటీపీ, మగ్గం వర్క్స్, మల్టీమీడియా, క్లాత్, జూట్, బంజారా బ్యాగుల తయారీ వంటి కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. సదరు కోర్సులలో నైపుణ్యం, తగిన విద్యార్హతలు, అనుభవం గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, సంబంధిత రంగంలో అనుభవ వివరాలతో కూడిన దరఖాస్తులను నవంబర్ 18వ తేది వరకు జనరల్ మేనేజర్ కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్ సేవా కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు