మహా చండి అలంకారంలో దుర్గాదేవి
ఎర్రుపాలెం అక్టోబర్ 14 ( విజయ క్రాంతి): మహా చండీ అలంకారంలో దుర్గాదేవి(Goddess Durga in Maha Chandi Alankaram) భక్తులకు దర్శనమిస్తున్నారుతెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు నేడు నాలుగోవ రోజు ఉత్సవంలో భాగంగా ఉదయం 5-00 గంటల నుండి నిత్య పూజకార్యక్రమములు,
అనంతరం ఉదయం 10-00 గంటలకు పురుషసూక్త హోమం నిర్వహించినారు. ఉదయం 11 గంటలకు శ్రీ ఈరోజు అమ్మవారు శ్రీ మహా చండి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చినారు. ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సుమారు 450* మంది స్వామి వారి అన్న ప్రసాదములు సేకరించడం* జరిగినది.
కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్ శర్మ, వేదపండితులు, ఆలయ అర్చకులు మరియు సిబ్బంది గ్రామస్తులు భక్తులు పాల్గొనడం జరిగినది.