కేటీఆర్ సభకు బయలుదేరిన బీఆర్ఎస్ యువ నాయకులు
ధర్మపురి,అక్టోబర్ 14(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) గోదావరిఖనిలో పాల్గొనే సభకు హాజరయ్యేందుకు వెల్గటూర్ మండల బీఆర్ఎస్ యువ నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు. పార్టీ నాయకత్వం పిలుపు మేరకు యువ నాయకులు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్న యువత సభకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపారు.ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి యువత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు సభకు బయలుదేరినట్లు వెల్లడించారు.బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం యువత ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు తరలివెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో బందెల సతీష్ గౌడ్, గాజుల సుమన్, ఎనగందుల తిరుపతి,కస్తూరి రవి, జంగిలి వెంకటేష్ లు పాల్గొన్నారు.