నియోజకవర్గానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలి

14-10-2026 | 07:47pm

టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డికి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కుడుదుల వెంకన్న, శశి భూషణ్ వినతి

పంటలను కాపాడేందుకు అదనపు విద్యుత్ అందిస్తామని హామీ

మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి, రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కుడుదుల వెంకన్న, టీపీసీసీ సభ్యుడు ఈపీసీసీ సభ్యులు శశి భూషణ్ వినతిపత్రాన్ని అందజేశారు. బుధవారం హనుమకొండలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి(TGNPDCL CMD Varun Reddy) ఐఏఎస్‌ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు.

మంథని నియోజకవర్గంలోని వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలతో పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

పంటలను కాపాడేందుకు చర్యలు

కాంగ్రెస్ నాయకుల వినతిపై సీఎండీ వరుణ్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన అదనపు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు