శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఫ్రెండ్స్ యూత్ అమ్మవారు
15-10-2026 | 07:49pm
మహా చండీ హోమం నిర్వహణ
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 15 ( విజయక్రాంతి ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియం(Ambedkar Stadium) ఎదురుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా పురోహితులు కొదురుపాక కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమం అనంతరం మహా చండీ హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.