నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడాలి.. మొక్కలు పెంచాలి
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రచారం
గణపురం, నవంబర్ 28 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(impact of El Niño), వర్షాభావ పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం(Telangana Samskruthika Sarathi Art Troupe) ఆధ్వర్యంలో శనివారం గణపురం మండలం(Ganapuram Mandal) లక్ష్మారెడ్డిపల్లిలో పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma), డీపీఆర్ఓ శ్రీనివాస్ ల ఆదేశాలతో నిర్వహించిన కార్యక్రమంలో కళాబృందం సభ్యులు జానపద పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఎల్‌నినో ప్రభావాలను వివరించారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి దుప్పటి రవి, కొండపర్తి స్వప్న, కంచర్ల శ్యామల, గడ్డం రజిత తదితరులు పాల్గొన్నారు.