రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు
సుల్తానాబాద్, నవంబరు 28 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (Athletics) పోటీలకు సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ (Indian Public School) విద్యార్థులు ఎంపికయ్యారు. ఎనిమిదో తరగతి విద్యార్థి ఈ. రిత్విక్ తేజ కిడ్స్ జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించగా, తొమ్మిదో తరగతి విద్యార్థి ఎం. సంప్రీత్ 80 మీటర్ల పరుగు (Running), లాంగ్ జంప్ (Long Jump) విభాగాల్లో రజత పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారు.
ఈ నెల 24న ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో పెద్దపల్లి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14, అండర్-16 బాలుర పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 30న నిజామాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంపై పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ మాటేటి కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేశారు. వారిని అభినందించి, తదుపరి పోటీల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించేందుకు పాఠశాల యాజమాన్యం (Management) అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సునీత, మేనేజర్ శివ, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.