మా కలయికలో రాజకీయాలు లేవు

28-11-2026 | 04:16pm

సంగారెడ్డి: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy), బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు(Harish Rao) 21 ఏళ్ల తర్వాత కుటుంబ వేడుకలో కలుసుకున్నారు. జగ్గారెడ్డి కుమారుడి వివాహం సందర్భంగా ఆయన నివాసానికి వచ్చిన హరీశ్ రావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తమ కలయిక వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

2004లో హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కలిసి భోజనం చేసేవాళ్లమని, కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత మళ్లీ కలుసుకోలేదని గుర్తుచేశారు. కుటుంబ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో హరీశ్ రావు వచ్చారని తెలిపారు. పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. హరీశ్ రావు బీఆర్ఎస్‌లో టాప్ లీడర్ అని, తాను టాపో.. తుప్పో అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు