ఆల్ఫోర్స్ లో నాణ్యమైన విద్యాబోధన

28-11-2026 | 05:53pm

ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి 

సుల్తానాబాద్ , నవంబర్ 28 (విజయక్రాంతి) : చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత ప్రతిభను వెలికితీస్తూ వినూత్న బోధన పద్ధతులతో విద్యను అందిస్తున్నామని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి(Dr. Narender Reddy, head of Alforce Educational Institutions) అన్నారు, శనివారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో(Allforce School) ప్రీపై మరి విద్యార్థులకు అడవి అద్భుతాలు, భారతీయ సంస్కృతి , మన వేషధారణ , పండ్ల పండుగ,  ఆరోగ్య మహాభాగ్యం వంటి అంశాల్లో ప్రత్యేక బోధన కార్యక్రమాన్ని విద్యార్థులచే ప్రత్యక్షంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం పాఠ్యాంశాలలోనే కాకుండా అన్ని రంగాల్లో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యబోధన చేస్తున్నామని , ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసం పెంచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు పలు అంశాల్లో ప్రదర్శించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు విద్యార్థిని,  విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు