ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి

28-11-2026 | 05:42pm

గణపురం, నవంబర్ 28 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు ఫూలే(Mahatma Jyotirao Phule) వర్ధంతిని అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్(Shanigarapu Rajender) ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే మహిళా విద్య, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు తిక్క సంపత్, ధర్మ సమాజ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి, వార్డు సభ్యులు కోడెపాక అనిల్, మోటపోతుల రాము, కొమ్ముల లింగయ్య, దుర్గం సుమన్, సారయ్య, మోర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు