టేకు చెట్ల నరికివేతపై విచారణకు బీఆర్ఎస్ డిమాండ్
అక్రమ కలప తరలింపుపై సమగ్ర విచారణ జరపాలి: కట్టా అజయ్ కుమార్, డాక్టర్ లక్కినేని రఘు
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండల(Kallur Mandal) పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 10 టేకు చెట్ల నరికివేత ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఇందులో భాగస్వాములైన వారందరిపై కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్(BRS) నాయకులు కట్టా అజయ్ కుమార్, డాక్టర్ లక్కినేని రఘు డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నరికివేసిన చెట్లను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేవలం ఇద్దరిపై కేసులు నమోదు చేయడం సరిపోదని, చెట్ల నరికివేత నుంచి కలప తరలింపు వరకు సంబంధం ఉన్న వారందరినీ విచారించాలని కోరారు. నరికివేసిన చెట్ల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పేర్కొంటూ, అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెడకంటి రామకృష్ణ, కనపర్తి శ్యామల రాజ్ కుమార్, ఇస్మాయిల్,దార్ల రమేష్, ఇంతియాజ్, పెద్ద బోయిన నాగమల్లేశ్వరరావు, పుసులూరి శ్రీనివాసరావు,మేకల కృష్ణ,షేక్ కమ్లి,కుక్కా అంజన్ రావు,కావటి నర్సయ్య,చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, బండి వెంకటి,రావి సూర్యనారాయణ,కృష్ణతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.