సంగారెడ్డిలో పరీక్ష రాసే అభ్యర్ధులకు ప్రత్యేక బస్సు
- సిద్దిపేట టూ సంగారెడ్డి డీలక్స్ సర్వీస్
సిద్దిపేట,(విజయక్రాంతి): ఈ నెల 30నాడు సంగారెడ్డిలో ఎస్ఐ పరీక్ష(SI exam) రాసేందుకు సిద్దిపేట నుంచి వెళ్ళే అభ్యర్ధుల కోసం సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ హెచ్. శ్రీనివాస్(Siddipet RTC Depot Manager H. Srinivas) ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 4గంటలకు సిద్దిపేట టూ సంగారెడ్డి డీలక్స్ సర్వీస్ బయలుదేరుతుందన్నారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణం సౌకర్యం కూడా ఉందన్నారు.
అభ్యర్ధులు శనివారం ఉదయం 10గంటల నుంచి సిద్దిపేట కొత్త బస్ స్టాండ్ లోని బస్సు పాస్ కౌంటర్ లో ముందస్తుగా టికెట్ తీసుకునే సౌకర్యం ప్రారంభమవుతుందని సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు టికెట్ పొందే అవకాశం ఉందని వెల్లడించారు. ఎస్ఐ పరీక్షకు వెళ్ళే అభ్యర్ధులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది కేవలం పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.