ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల పరిశీలన

27-11-2026 | 12:16pm

రాజ్యాంగ దినోత్సవ వేడుకలతో పాటు ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల పరిశీలన

హన్వాడ, (విజయక్రాంతి): మండల పరిధి లోని ఇబ్రహీంబాద్ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి(Indiramma Bima Applications) సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారులు పరిశీలించారు. గ్రామ పంచాయతీ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్, ఎంపీడీవో, డిప్యూటీ ఈఈ (హౌసింగ్) దరఖాస్తుల స్వీకరణ తీరును, సంబంధిత రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శికి పలు సూచనలు చేస్తూ, అర్హులైన కుటుంబ సభ్యులందరికీ ఈ పథకంపై అవగాహన కల్పించి, దరఖాస్తుల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ప్రజలు కూడా అధికారులకు, పంచాయతీ సిబ్బందికి సహకరించి అవసరమైన వివరాలు అందించాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఎంపీడీఓ యశోద కార్యదర్శి శిల్ప ఉపసర్పంచ్ కేశవులు వాసు సుదర్శన్ రెడ్డి గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు