గుంతలమైన రోడ్డు పట్టించుకోని అధికారులు
సదాశివనగర్,(విజయక్రాంతి): నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రయాణించే బాన్స్ వాడ నుండి కామారెడ్డికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులైతే రోడ్డుపై ప్రయాణించలంటేనే నరకప్రాయంగా ఉందని, రోడ్డుపై వెళుతుంటే గుంతలో పడి వాహనాలు, వెనకాల కూర్చున్న మహిళలు వాహనంపై నుండి కింద పడుతున్నారు.
కొన్ని సందర్భాల్లో మహిళల తలకు గాయాలు కావడంతో ఆసుపత్రి పాలవుతున్నారు. పద్మాజీవాడి చౌరస్తా నుండి గాంధారి వరకు కిలోమీటర్ల పొడవునా రహదారి గుంతలమయమైన గాని,రహదారి అధికారులు స్పందించడం లేదని, మరమ్మత్తులు చేపట్టడం లేదని వాహనాదారులు ఆరోపించారు. ఇకనైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి తాత్కాలిక మరమతులైన చేపట్టాలని కోరుతున్నారు.