2 September, 2026 | 10:41 AM

వినాయక ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్ నార్ల సురేష్

02-09-2026 | 09:56am

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ హనుమాన్ వ్యాయామశాలలో(Sri Hanuman Gymnasium) నిర్వహించనున్న వినాయక ఉత్సవాల(Ganesha Festival) ఏర్పాట్లను బుధవారం ఆలయ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ పరిశీలించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన పనులను సూచించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు హరినాథ్ తదితరులు ఉన్నారు.