3 September, 2026 | 1:01 AM

అబద్ధాల సీఎం గద్దె దిగాలి

03-09-2026 | 12:07am
  1. జూటా పాలనకు కేరాఫ్ రేవంత్ ప్రభుత్వం
  2. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
  3. కామారెడ్డిలో వరదల వల్ల జరిగిన నష్టం
  4.     420 హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం
  5.     100 రోజులన్నారు..1000 రోజులు అయ్యింది
  6. ఏడు రోజుల పోరు బాటను విజయవంతం చేయండి
  7. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
  8. కాంగ్రెస్ 420 హామీల అమలుకు బీఆర్‌ఎస్ పోరుబాట
  9. తొలి రోజు ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ, 420 హామీల ఫ్లెక్సీ ప్రదర్శన

కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): అబద్దాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy,) గద్దె దిగాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Gampa Govardha) అన్నారు. బుధవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం(Kamareddy Municipal Office) ఎదుట బిఆర్‌ఎస్ పార్టీ నాయకుల(BRS party leaders)తో కలిసి కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఒక్క హామీ మాత్రమే నెరవేర్చారన్నారు.

అబద్ధాల సీఎం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. 420 హామీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించి అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్న హామీల అమలులో ఘోరంగా విఫలం కావడంతోపాటు విధ్వంస పాలన కొనసాగిస్తుందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల దగా పాలన నిరసిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కామారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్ నేతృతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా  వరకు ఫ్లెక్సీ ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు.

బాన్సువాడ(Banswada)లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన లో చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్మూర్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాల్కొండ లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బోధన్లో మాజీ ఎమ్మెల్యే  షకీల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 420 హామీలను ప్రజలకు ఇచ్చిన మాటగా భావించి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ప్రజా సమస్యపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.