3 September, 2026 | 1:49 AM

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం

03-09-2026 | 12:14am

టీఎన్‌ఎస్‌ఎఫ్  రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్

కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఫీజు బకాయిలను చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్(Parlapalli Ravinder), డాక్టర్ బాలు అన్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy distric) కేంద్రంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం(Telangana Stat)లో ప్రజా పాలన పేరుతో విద్యార్థుల(Students)ను వంచించే పాలన కొనసాగుతుందని అన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం(BRS Government) అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని అన్నారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు బకాయాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులే కాకుండా కళాశాలల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే  పెండింగ్లో ఉన్న పూర్తి ఫీజు బకాయిలను చెల్లించాలని లేకపోతే టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలియజేశారు.

గ్రామీణ ప్రాంతాలు నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న డిగ్రీ కళాశాల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని అన్నారు. ప్రభుత్వం ఫీజుబకాయలు ఇస్తుందన్న నమ్మకంతో ఉచిత విద్యను అందజేసిన కళాశాలలకు బకాయిలను ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఈ విషయాన్ని గమనించి ఫీజుబకాయలను విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ బాధ్యులు మోతే రాజిరెడ్డి,లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ పటేల్ లు పాల్గొన్నారు.