3 September, 2026 | 3:18 AM

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్‌ఆర్

03-09-2026 | 12:19am

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ప్రజల గుండెల్లో వైయస్సార్(YSR) చిరస్థాయిగా నిలిచారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి(Gaddam Chandrasekhar Reddy) అన్నారు. బుధవారం కామారెడ్డిలో వైయస్సార్ వర్ధంతి(YSR death anniversary) వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(Congress party office)లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేదలు రైతులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు.

ఆయన ఆశయాలు ప్రజాతి సేవ స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదల అధ్యక్షులు గడ్డమీది మహేష్, డిసిసి ఉపాధ్యక్షులు పంపరి శ్రీనివాస్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కృష్ణ హరి, డిసిసి జనరల్  సెక్రెటరీ నిమ్మ విజయకుమార్ రెడ్డి, జూలూరు సుధాకర్, తాటి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు చింతల రవీందర్ గౌడ్, జమీల్, మేహర్ బాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.