మిషన్ భగీరథ ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్
ఆసిఫాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): మిషన్ భగీరథ(Mission Bhagiratha) కార్మికులకు ఎస్ఎస్ఆర్ ప్రకారం వేతనాలు చెల్లించకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్న ఐదు ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం డివిజన్ కార్యాలయంలో డీఈ పృథ్వీరాజ్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెట్రోల్ అలవెన్స్ కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరి చిరంజీవి, జయకృష్ణ, షబాజ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.