తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

15-10-2026 | 08:07pm

బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం 

బాన్సువాడ, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): తెలంగాణ సంస్కృతి(Telangana culture), సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నర్సింగ్ కళాశాల(Banswada Nursing College)లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(MLA Pocharam Srinivas Reddy), మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈ వేడుకలు చాటిచెప్పాయి అని ఎమ్మెల్యే పోచారం పేర్కొన్నారు.

విద్యార్థినులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. విద్యార్థినీలతో కలిసి పోచారం న్యూత్యాలు చేసి బతుకమ్మ ఆట ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రణతి , ఎరువాల కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, ప్రజా ప్రతినిధులు కళాశాల అధ్యాపకులు విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు