రైతులకు అందుబాటులో శనగ విత్తనాలు
29-09-2026 | 05:14pm
సదాశివనగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండలంలోని సదశివనగర్, పద్మాజీవాడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘలకు శనిగ విత్తనాలు వచ్చినట్టు మండల వ్యవసాయ అధికారి ప్రజాప్రతి(Mandal Agricultural Officer Prajaprathi) తెలిపారు. సదాశివనగర్ కి 400 బస్తాలు, పద్మాజీవాడికి 200 బస్తాలు వచ్చినట్టు, ఒక బస్తా 25 కిలోలు ఒకటి 2175 రూపాయలు చెల్లించాలన్నారు. సొసైటీ పరిధిలో రైతులు తమ పట్టాదారు పాసుబుక్కు తీసుకొచ్చి శనిగల బస్తాలు తీసుకెళ్లలని సూచించారు.