రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో గిరిజా దివ్యశ్రీ

29-09-2026 | 05:50pm

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌(State level Science Seminar)లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కేజీబీవీకి చెందిన 10వ తరగతి విద్యార్థిని గిరిజా దివ్యశ్రీ పాల్గొంది. హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ తెలంగాణ కార్యాలయ ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ఈ సెమినార్‌కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంపికైన విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన దివ్యశ్రీ.. “Indian Energy Basket 2047 – Prospects and Challenges” అనే అంశంపై ప్రసంగించింది.

భవిష్యత్ భారతదేశ ఇంధన అవసరాలు, ఇంధన వనరుల అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లను వివరించింది. రాష్ట్రస్థాయి వేదికపై జిల్లా తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని జిల్లా విద్యాశాఖ అధికారులు, కేజీబీవీ అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు. సెమినార్‌కు సిద్ధం కావడంలో కేజీబీవీ కాగజ్‌నగర్ సీఆర్‌టీ డి. లక్ష్మీప్రసన్న మార్గదర్శకత్వం అందించారు.

మరిన్ని వార్తలు