గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం హర్షనీయం..
తాడ్వాయి, నవంబర్ 06 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు, నాబార్డ్ ద్వారా పాఠశాలలకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) నిధులు కేటాయించడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల శాఖ ఇన్చార్జి మర్రి బాలకిషన్ మాట్లాడుతూ.. ప్రధాని గ్రామపంచాయతీలకు, పాఠశాలలకు నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.అంతకుముందు మండల యువమోర్చా అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి,కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా స్వామి రెడ్డి,ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా రమేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వాణి, దళిత మోర్చా అధ్యక్షుడిగా శివయ్య, గిరిజన మోర్చా అధ్యక్షుడిగా నరేష్, మైనార్టీ మోర్చా అధ్యక్షునిగా అబ్దుల్ రెహమాన్ లను నియమించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు,అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, నాయకులు గంగారెడ్డి,హోటల్ శ్రీను,వెంకట్ రావు,తిరుపతిరెడ్డి, నర్సింలు,దత్తాద్రి, రాజిరెడ్డి, బాలాజీ, ధర్మపురి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.