ప్రతి పేదవాడికి భరోసా...
తాడ్వాయి, నవంబర్ 25(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చి భరోసాగా నిలుస్తుందని తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు సంజీవులు(Congress leader Bandaru Sanjeevulu) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో బుధవారం ఏర్పుల భూధవ్వ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఎంతోమంది ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య,ఉప సర్పంచ్ పొద్దుటూరి నవీన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ,రాజీవ్ కుమార్ గ్రామ కమిటీ అధ్యక్షులు బాల సాయిలు వీడిసి అధ్యక్షులు కంకణాల బాలచంద్రం,పల్లె గడ్డ తండా,ఎర్ర పహాడ్ గ్రామాల సర్పంచులు రేణుక గణపతి,మల్లవ్వబీరయ్య, తదితరులు పాల్గొన్నారు.