కేజీబీవీలో విద్యార్థి ఘటనపైన సమగ్ర విచారణ జరిపించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తారా సింగ్...
పెంట్లవెల్లి నవంబర్ 25: నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ప్రమీల పై అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇంగ్లీష్ ఫ్యాకల్టీ టీచర్ అమ్మాయి జడలు వేసుకోకుండా పాఠశాల సమయానికి తయారు కాకుండా గా. ఉంటుందని ఆ విద్యార్థినిపై ప్లాస్టిక్ పైపుతో రెండు చేతులపై కొట్టడం ఏంటని ఆరోపించారు. ఇట్టి ఘటనలో అమ్మాయికి గాయాలయ్యాయి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తార సింగ్(SFI District Secretary Tara Singh) మాట్లాడుతూ.. కేజీబీవీ పాఠశాలలో నిరంతరం ఏదో ఒక ఘటన జరుగుతానే ఉంటుంది. కానీ ఈ విద్యాసంస్థలలో పర్యవేక్షణ లేకుండా అధికారులు చుట్టపు చొప్పులాగా వస్తు పోతున్నారు. తప్ప క్షేత్రస్థాయిలో సమగ్రమైనట్టే దర్యాప్తు చేయకుండా వారి యొక్క విద్యా బోధన అంశాలు తెలుసుకోకుండా తూతూ మంత్రంగా వ్యవహరించడం వలన కస్తూర్బా గాంధీ పాఠశాలలో జిల్లాల వరుసగా ఘటనలు జరుగుతున్నాయి.
దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి జిల్లాలో ఉన్న అన్ని కేజీబీవీల పైన సమగ్ర విచారణ దర్యాప్తు చేస్తూ పరిశీలించి అందులో వచ్చిన సమస్యల్లోనే తక్షణమే పరిష్కరించాలి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు. లేనివెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రజాసంఘాల నాయకులు బి శివవర్మ. హనుమంతు ఎల్ల గౌడ్. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.