పామ్ ఆయిల్ సాగు పై క్షేత్ర ప్రదర్శన
04-11-2026 | 09:00pm
బోథ్. నవంబర్ 4 ( విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) విద్యార్థులకు బుధవారం పామాయిల్ సాగుపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం సమీపంలో ఉన్న పామాయిల్ తోటలోకి విద్యార్థులను తీసుకువెళ్లి పామాయిల్ సాగుపై అవగాహన కలిగించారు. అంతేగాక పామాయిల్ సాగు వల్ల లబ్ది పొందుతామని రైతు వివరించడం జరిగింది.