ఎమ్మెల్యేను కలిసిన నాయకులు..
తాడ్వాయి, నవంబర్ 03 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao)ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామంలోని పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజాగౌడ్, బ్రాహ్మణపల్లి గ్రామ ఇన్చార్జి పైడి రాజేశ్వర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు తూర్పు రాజేంద్రప్రసాద్ రావు, సీనియర్ నాయకులు భోగ నరేందర్, పాఠశాల పిఈటి నగేష్ తదితరులు పాల్గొన్నారు.