ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి: ఎంపీడీవో
06-10-2026 | 06:58pm
నాగిరెడ్డిపేట, అక్టోబర్ 6 (విజయక్రాంతి): మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో గంగాధర్(MPDO Gangadhar) ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని గ్రామస్తులుకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ... నీటి వృధాను అరికట్టి భూగర్భజలాలు పెంపొందినందుకు మ్యాజిక్ సోప్ బిట్స్ తవ్కోవాలని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వర్షిని, పంచాయతీ కార్యదర్శి శంకర్ నాయక్, ఉపాధ్యామి క్షేత్ర సహాయకులు రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.