"కాలకూట విషం" వార్తపై పోలీసుల చర్యలు

18-11-2026 | 05:40pm

విజయ కాంతి వార్తకు స్పందన...

కళ్ళు కాదు కాల కూట విషం వార్తపై స్పందించిన పోలీసు అధికారులు           

నిజాంసాగర్ నవంబర్ 18( విజయక్రాంతి): విజయ క్రాంతి దినపత్రికలో ఈనెల 13వ తేదీన 'కళ్ళు కాదు కాలకూట విషం' అనే శీర్షికన ప్రచురితమైన వార్త కథనానికి నిజాంసాగర్ పోలీసులు(Nizamsagar Police) ఎట్టకేలకు స్పందించారు. కొమలంచ గ్రామంలో కల్తీకల్లు(adulterated toddy) అమ్ముతున్నారని సమాచారంతో రౌతు అంజా గౌడ్, రౌతు లక్ష్మ గౌడ్ ల దుకాణాలపై నిజాంసాగర్ పోలీసులు దాడి చేసి కళ్ళు తాగుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను  బాన్సువాడ ప్రభుత్వ దవాఖాన(Banswada Government Hospital) కు పంపించి  పరీక్షించగా మత్తు పదార్థాల పాజిటివ్(Positive for narcotic substances) రావడంతో కళ్ళు  అమ్ముతున్నటువంటి పద్మశాలి కాశీరాం కళ్ళు దుకాణం యజమానులు రౌతు అంజా గౌడ్, రౌతు లక్ష్మా గౌడ్  లపై కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు