బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ

18-11-2026 | 06:27pm

జిల్లా అధ్యక్షులు మద్దెలబండ సాయిబాబు.

 కొల్లాపూర్ నవంబర్ 18: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం కేంద్రంలోని బుధవారం సామాజిక పరివర్తన కోసం పాటుపడిన మహనీయుల జీవిత చరిత్రలు, పోరాటాలు(Biographies and struggles of great figures) మరియు ముఖ్య సంఘటనలు నేటి యువతరానికి సందేశం అదే విధంగా నేడు యువతను పట్టిపీడిస్తున్న హమ్మారి అయిన మత్తు పదార్థాల(Narcotic substances) పై ఈ పోటీ నిర్వహిస్తున్నారు. 1.మహాత్మ జ్యోతిరావు పూలే, 2.డా. బి.ఆర్ అంబేద్కర్, 3.మహాత్మా గాంధీ, 4.స్వామి వివేకానంద 5.ఝల్కరీ భాయ్, 6.సంత్, సేవాలాల్ మహారాజ్, 7.ఫాతిమా షేక్, 8.సావిత్రిబాయి పూలే, 9.మత్తు పదార్థాల నివారణ వాటి వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులు వ్యాసరచన చేయాల్సి ఉంటుందని ఈ కోటి పాఠశాల మరియు కళాశాల స్థాయిలలో ఉంటుంది. బహుమతికి గాను, రెండవ బహుమతి గాను మూడవ బహుమతికిగా నగదు తో పాటు ప్రశంసా పత్రాలు ఇవ్వబడును అని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మద్దెలబండ సాయిబాబు తెలిపారు ఆసక్తి కలిగిన విద్యార్థులు  తమ పేరు, వారు రాసే టాపిక్ చరవాణి సంఖ్య 9490145100 కు వాట్సాప్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు