కార్మికుడి కుటుంబానికి రూ. కోటి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

18-11-2026 | 06:32pm

బెల్లంపల్లి: ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందిన సింగరేణి కార్మికుడి(Singareni worker) కుటుంబానికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంక్ అధికారులు(Bellampalli Union Bank officials) కోటి రూపాయల చెక్కును అందజేశారు. బెల్లంపల్లి స్టేషన్ రోడ్ కాలనీ నివాసి కాసిపేట గనిలో జనరల్ మజ్దూర్ గా పనిచేసినా పులి మూర్తి(Puli Murthy) గత సంవత్సరం లక్సెట్టిపేట(Luxettipet) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందాడు. ఇతను బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు(Union Bank, Bellampalli) లో సాలరీ అకౌంట్(Salary Account) కలిగి ఉండడం వల్ల యూనియన్ బ్యాంకు నుంచీ ఇన్సూరెన్స్ డబ్బులను చెల్లించారు.

బుధవారం బ్యాంకులో జరిగిన ఒక కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు (హైదరాబాద్ ),డీజీఎం నటరాజన్ (కరీంనగర్ ),బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ చందన్ కుమార్ ల చేతుల మీదుగా పులి మూర్తి నామినీలుగా వున్న భార్య పులి జోత్స్న, తల్లి అనసూర్య లకు ఈ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సీజీఎం రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క వినియోగదారుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు