మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బొమ్మక్ శ్రీనివాస్
మేడిపల్లి, నవంబర్ 18 (విజయక్రాంతి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బోడుప్పల్ డివిజన్‌కు(Boduppal Division) చెందిన బొమ్మక్ శ్రీనివాస్ నియమితులయ్యారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(Congress Committee President) తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా బొమ్మక్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్ష పదవి కల్పించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బొమ్మక్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.