ఎండ్రియాలలో లబ్ధిదారులకు పింఛన్ పత్రాల పంపిణీ

18-11-2026 | 05:58pm

తాడ్వాయి,నవంబర్,18( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రి యాల గ్రామంలో(Yendri Yala Village) బుధవారం లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ పత్రాలను గ్రామ సర్పంచ్ కొర్ని నర్సింలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అర్హులైన వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు పింఛన్ల కోసం ఎదురుచూశారని తెలిపారు.

ప్రభుత్వం అర్హులైన అందరికీ పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం పొంగిపోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాడువాయి సింగిల్ విండో చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు, ఉప సర్పంచ్ గడ్డం నరసారెడ్డి,నాయకులు నారాయణరెడ్డి,స్వామి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు