రైస్ మిల్ వ్యాపారుల్లో గుబులు

03-11-2026 | 05:15am
  1. అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులు అజ్ఞాతంలో.. 
  2. ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు 
  3. ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్ వ్యాపారుల్లో ఆందోళన 
  4. దీపావళికి చుక్కలే చూస్తున్న వ్యాపారులు

కామారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ వ్యాపారుల(rice mill traders) కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఎప్పుడు ఎవరు వచ్చి ఏ విధంగా దాడులు నిర్వహిస్తారో అని అక్రమ రైస్ మిల్  వ్యాపా రులు ఆందోళన చెందుతున్నారు.

అక్రమ వ్యాపారులపై చర్యలు

 ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్(CMR Rice) సకాలంలో చెల్లించని వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల ఉమ్మ డి జిల్లాలో పలువురు రైస్ మిల్ వ్యాపారులపై కేసులు నమోదు చేసిన అధికారులు సీ ఎంఆర్ డబ్బులు చెల్లించని రైస్ మిల్ వ్యాపారులపై కొరడా జూలిపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో(Kamareddy District) ఆరుగురు రైస్ మిల్ వ్యాపా రులపై కేసులు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్టు చేసి కోర్టుకు పంపారు.

సన్నబియ్యం ఇవ్వకుండా దొడ్డు బియ్యం అడ్డపెట్టిన వారిపై చర్యలు

మరికొందరు రైస్ మిల్ వ్యాపారులు సన్నబియ్యాన్ని ఇవ్వకుండా దొడ్డు బియ్యం అప్పగించిన రైస్ మిల్ వ్యాపారులపై అధికారులు దృష్టి సారించారు. సకాలంలో ప్రభు త్వానికి సన్న బియ్యం ఇవ్వకుండా దొడ్డు బి య్యంతో సరిపెట్టిన వ్యాపారులపై, అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. నిజామాబా ద్ లో జిల్లా సరఫరాల శాఖ లో పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డి పై చర్యలు తీసుకున్నారు. స స్పెండ్ చేస్తూ వేటు వేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించడమే కాకుండా అక్రమ రై స్ మిల్ వ్యాపారులకు కొమ్ముకాశారని అధికారుల విచారణలో తేలడంతో అతనిపై చర్యలకు ఉపక్రమించారు.

ఉమ్మడి జిల్లాలో ఆందోళన చెందుతున్న అధికారులు

ఉమ్మడి జిల్లాలో అక్రమంగా సిఎంఆర్ రైస్ ప్రభుత్వానికి అప్పగించని రైస్ మిల్ వ్యాపారులకు అధికారులు ఎవరెవరు సహకరించారు అనే కోణంలో ఉన్నతాధికారులు, సిబిఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నా రు. పట్టుబడిన వ్యాపారుల నుంచి అధికారు ల వివరాలను సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు.

గతంలో కామారెడ్డి సివిల్ సప్లై కా ర్యాలయంలో అవుట్సోర్సింగ్ లో ఆపరేటర్ గా పని చేసిన వ్యక్తి రైస్ మిల్ వ్యాపారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయించిన విషయం విధితమే. మరి కొంతమంది అధికారులు సీఎంఆర్ రైస్ నిలువలు లేకున్నా ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారులపై ఉన్నతాధికారులు న జర్ పెట్టారు. దీంతో ఎప్పుడు ఎవని అరెస్టు చేస్తారో అని అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారు లు ఆందోళన చెందుతున్నారు.

దీపావళికి చుక్కలే..

రైస్ మిల్ వ్యాపారుల కుటుంబ సభ్యులు సైతం కంటికి  కునుక్కు లేకుండా ఆందోళన చెందుతున్నారు. దీపావళికి చుక్కలు చూస్తున్నారు. దీపావళి  ముర్వత్ నిర్వహిస్తూ కొత్త సంవత్సర వ్యాపారం ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్స ర వ్యాపారం కు శ్రీకారం చుట్టే వ్యాపారులు ఈ ఏడాది దీపావళికి చుక్కలు చూస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులు వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనచెందుతున్నారు. ఎప్పుడు ఏ పిలుపు వస్తుం దోనని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. అక్రమ రైస్ మిల్ వ్యాపారులపై ప్ర భుత్వ ఉన్నతాధికారులు సీరియస్ గా ఉండడమే కాకుండా చర్యలకు ఉపక్రమించడంతో ఆందోళన చెందుతున్నారు. 

అజ్ఞాతంలోకి వ్యాపారులు

ఉమ్మడి జిల్లాలోని రైస్ మిల్ వ్యాపారు లు ఆందోళన చెందడం కాకుండా అజ్ఞా తంలోకి వెళ్లి అవస్థలు పడుతున్నారు. ప్రభు త్వ పెద్దల అండదండలు తీసుకునేందుకు తా పత్రయపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలను మరోసారి అవకాశం ఇవ్వాలని రైస్ మిల్ వ్యాపారులు కోరుతున్నారు. చర్యలకు పాల్పడవద్దని తాము బకాయిపడిన బియ్యాన్ని అప్పగిస్తామని వేడుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో మిల్లర్లు, అక్రమాలకు పాల్పడ్డ అధికారులు అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు.

వ్యాపారుల అడ్రస్ కోసం అధికారుల చక్కర్లు

 ప్రభుత్వానికి సీఎం అప్పగించని వ్యాపారుల కోసం అధికారులు చక్కర్లు కొడుతున్న వ్యాపారులు అందుబాటులోకి రావడం లేదు. దీంతో రైస్ మిల్లులో నిలువలు ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమకు ముప్పు తప్పదని కొంతమంది అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్ వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని, వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

ప్రభుత్వం సీరియస్ 

ఉమ్మడి జిల్లాలోని అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సీరియస్ గా ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వ్యాపారులు ఇప్పటికైనా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ రైస్ అప్పగించాలని కోరారు.

మరిన్ని వార్తలు