జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు హక్కులు కల్పించాలి
తాడ్వాయి,నవంబర్,04( విజయ క్రాంతి): రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు హక్కులు(Rights for Madigas) కల్పించాలని సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు(Senior MRPS leaders) కోరారు. హైదరాబాదులో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.
మాదిగ మాదిగ ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వం అందించే అన్ని పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మాదిగ మాదిగ ఉప కులాలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా దళిత బంధు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచి మాదిగ మాదిగ ఉపకులాలకు అందించాలని కోరారు.
మాదిగ మాదిగ ఉప కులాలు రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి పోతున్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లారం రత్నయ్య, ఉపాధ్యక్షులు సంజీవరావు, ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.