కామారెడ్డి యోగ సెంటర్లో ఆర్ఎస్ఎస్ ప్రతిజ్ఞ
పాల్గొన్న జిల్లా విభాగ్ ప్రచారక్ శివకుమార్
కామారెడ్డి, అక్టోబర్ 06 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని రామాలయంలో హనుమాన్ యోగ కేంద్రంలో మంగళవారం ఉదయం ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ యోగ(RSS Vibhag Pracharak Shivakumar Yoga) సభ్యులచే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చేసే సేవలు దేశానికి ఆదర్శమని అన్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా హిందూ ధర్మాన్ని పాటించాలని భారతదేశాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సర్వ మతాల సమ్మేళనమే ఈ భారత దేశమని పేర్కొన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని మరి ఒకసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యోగా కేంద్రం యోగ గురువు గరిపల్లి అంజయ్య గుప్తా, ఎల్లంకి సుదర్శన్ గుప్తా, సరస్వతీ శిశు మందిర్ కార్యదర్శి పబ్బ శ్రీనివాస్, నక్క సిద్ధిరాములు,ఎం.రాజేందర్, గోపాల్ లోయ, పార్శి ఈశ్వర్ గుప్తా,పార్శి సతీష్ గుప్తా, ఇంజమూరి రాములు, రామచంద్రం,తదితరులు పాల్గొన్నారు.