దేమికలాన్ సరస్వతి సీడ్స్ అండ్ పటిలైజర్స్ లైసెన్స్ రద్దు

18-11-2026 | 04:52pm

తాడ్వాయి, నవంబర్,18( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలోని సరస్వతి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్(Saraswathi Seeds and Fertilizers) దుకాణం సీడ్ లైసెన్సును(Seed License) రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు అందించినట్లు తాడువాయి వ్యవసాయ శాఖ(Taduvai Agriculture Department) అధికారి నర్సింలు తెలిపారు.ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి లైసెన్సు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వివరించారు. దేమికలాన్ గ్రామంలోని సరస్వతి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణం యజమాని దుడుక గంగయ్య తాడ్వాయి మండలంలోని రైతులకు బీర్నీస్ రాజ్మా విత్తనాలను అందించారని తెలిపారు.

ఈ విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోవడంతో రైతులు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు.ఈ విషయమై విచారణ నిర్వహించగా విత్తనాలను సరైన లేబులింగ్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా లూస్ గా విక్రయించినట్లు గుర్తించామన్నారు.డీలర్ దుడుక గంగయ్య ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.డీలర్ వద్ద ఉన్న మొత్తం విత్తనాల నిల్వలను,అమ్ముడుపోని స్టాక్ తో సహా ఏడు రోజుల్లో గా సరఫరాదారులకు తిరిగి పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విత్తనాల స్టాక్ తిరిగి పంపిన వివరాలను పరిమాణం,ల్యాబ్ నంబర్లతో సహా జిల్లా వ్యవసాయ అధికారికి అందించాలని ఆయన పేర్కొన్నారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే సీడ్స్ చట్టం 1966 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలోని ఫర్టిలైజర్స్ విత్తన డీలర్లు నకిలీ విత్తనాలు,నకిలీ  ఎరువులు,నకిలీ  పురుగుమందులు అమ్మిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు