రెడ్లకుంటలో పింఛన్ల పంపిణీ
కోదాడ నవంబర్ 18(విజయక్రాంతి) : కోదాడ మండలంలోని(Kodad Mandal) రెడ్లకుంట గ్రామంలో సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు(Sarpanch Polampalli Kutumba Rao), ఉప సర్పంచ్ మల్లెల ప్రసాదరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు బుధవారం నూతన పింఛన్లను(New pensions) పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాలుగైదు సంవత్సరాల నుంచి ఎలాంటి పెన్షన్లు లేవు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వితంతు వికలాంగుల ఒంటరి మహిళల పెన్షన్లను(Pensions for widows, persons with disabilities, and single women) ఇవ్వడం. ఎంతో సంతోషంకరంగా ఉందన్నారు. ఇలాంటివి పేదలకు సమక్షేమాలు ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుందన్నారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్ నాగజ్యోతి పిచ్చయ్య సత్యనారాయణ రాంబాబు అల్లావి నాగలక్ష్మి వీరమ్మ తదితరులు పాల్గొన్నారు