వనదుర్గమ్మ సన్నిధిలో ఆకాశ దీప కాంతులు

20-11-2026 | 11:03pm

* ఏడుపాయల్లో కార్తీక వైభవం 

* ప్రత్యేక ఆకర్షణగా అలంకరణ 

పాపన్నపేట,నవంబర్20: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం(Papannapet Mandal) ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో కార్తీక శోభ సంతరించుకుంది. శుక్రవారం ఆలయ అర్చకులు వివిధ రకాల పుష్పాలతో కమలం పువ్వులో శివలింగం ఆకారాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రాత్రి సమయంలో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించిన అనంతరం కార్తీక దీపోత్సవం, ఆకాశ దీపోత్సవ వేడుకలను నిర్వహించారు. అమ్మవారి ముందున్న ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తంభానికి ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించి పైకి ఎగురవేశారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ ఆకాశదీపాన్ని వెలిగించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు