చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

26-09-2026 | 12:45pm

ముకరంపుర, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): తెలంగాణ పౌరుషా నికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ailamma)  పోరాట స్ఫూర్తి ని కొనసాగిద్దామని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్(Collectorate) రహదారి లోని చాకలి ఐలమ్మ  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, పేదలు మరియు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన మహా వీరనారి అని కొనియాడారు. భూస్వామ్య దోపిడీకి, అన్యాయానికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పేద బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కులకై పోరాడి ఆమె చూపిన ధైర్యం,తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక నేటి తరానికి ఐలమ్మ స్ఫూర్తిదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయీబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు జంపాల నర్సయ్య, బీ.సి హక్కుల సాధన రాష్ట్ర నాయకులు సుద్దాల రాజయ్య, ప్రజా సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి,కొత్త కొండ రవీందర్ రావు,బోయినపల్లి శ్రీనివాసరావు అండెం రమణారెడ్డి తదితరలు, పాల్గొన్నారు

మరిన్ని వార్తలు