అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రులు పొన్నం, వాకిటి
కరీంనగర్, సెప్టెంబర్26(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని డా,, బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ డా, భీంరావు రాంజీ అంబేద్కర్(Ambedkar) విగ్రహాన్నీ మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), వాకిటి శ్రీహరి(Vakiti Srihari)లు ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలోఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ,కార్పొరేషన్ చైర్మన్ లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి,సరితా తిరుపతయ్య యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చరణ్ కౌశిక్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య,ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2013 లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అంబేద్కర్ జయంతి రోజు కరీంనగర్ బస్ స్టేషన్ కి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. 13 సంవత్సరాల తర్వాత బస్ స్టేషన్ లో ఆ మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామన్నారు.