టిఆర్ఎస్ దళిత వింగ్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్

30-10-2026 | 02:10pm

ముకరంపుర, అక్టోబర్ 30(విజయ క్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీ(Telangana Protection Force Party) కరీంనగర్ జిల్లా అనుబంధ విభాగాల కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా దళిత వింగ్ అధ్యక్షుడి(Dalit Wing President)గా చంటి శ్రీనివాస్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు చంటి శ్రీనివాస్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో దళిత సామాజిక వర్గాల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన తరపున నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, ఆశయాల సాధనకు  ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు

మరిన్ని వార్తలు