నవంబర్ 29న ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష
కరీంనగర్లో సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు
కరీంనగర్ క్రైం,నవంబర్27(విజయక్రాంతి): ఎస్సీటీ సబ్-ఇన్స్పెక్టర్(SCT Sub-Inspector), తత్సమాన పోస్టుల భర్తీకి(Filling of equivalent posts) సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష(Preliminary Written Examination) ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Karimnagar Police Commissioner Gous Alam), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(Bharatiya Nagarik Suraksha Sanhita) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(Jawaharlal Nehru Technological University) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రాథమిక రాత పరీక్ష(Preliminary Written Examination) నవంబర్ 29 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి 1:00 గంట వరకు జరగనుంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ ప్రకారం కరీంనగర్ 1-టౌన్, కరీంనగర్ 2-టౌన్, కరీంనగర్ 3-టౌన్, ఎల్ఎండీ కాలనీ , కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురు (3) లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ పరిధిలో ఏదైనా చట్టబద్ధమైన సమావేశం నిర్వహించాలంటే సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ నిషేధాజ్ఞలు నవంబర్ 29న ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు అమలులో ఉంటాయి. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు.