మహాదేవపూర్‌లో జాతీయ మాల మహానాడు అడ్హాక్ కమిటీ ఏర్పాటు
మాల సామాజిక వర్గ ఐక్యత, హక్కుల సాధనకు కృషి చేయాలి
భూపాలపల్లి/మహదేవపూర్ నవంబర్ 27 విజయ క్రాంతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలంలో జాతీయ మాల మహానాడు మండల అడ్హాక్ కమిటీని(National Mala Mahanadu Ad-Hoc Committee) ఏర్పాటు చేశారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు, మహాదేవపూర్ మండలంలోని వివిధ గ్రామాల మాల కుల బాంధవుల సమక్షంలో జాతీయ మాల మహానాడు మంథని నియోజకవర్గ ఇన్చార్జి కందుగుల రాజన్న నూతన మండల అడ్హాక్ కమిటీని ప్రకటించారు.
ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యులుగా నీర్ల ప్రభాకర్, కోల మహేష్, మంచినీళ్ల రాజబాబు, బందెల రవిలను ఎంపిక చేశారు. మాల సామాజిక వర్గ అభ్యున్నతి, హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం కృషి చేయడంతో పాటు, సంఘం ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు సకినాల ప్రశాంత్, కాటారం మండల అధ్యక్షులు బోడబాబు, మాల నాయకులు బుర్రీ శివరాజ్, రేవెల్లి నాగరాజు, నీళ్ల లక్ష్మీరాజు, భూపెల్లి రవితేజ తదితరులు పాల్గొన్నారు.